ముంబై: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడేది ప్రశ్నర్ధకంగా కనిపిస్తోంది. మరో రెండేళ్లలో జరిగే ఈ మెగా టోర్నీకి టీమిండియాను సన్నద్ధం చేసేందుకు బిసిసిఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా యంగ్‌స్టార్లకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కోహ్లీ, రోహిత్‌లను తప్పించి కుర్రాళ్లకు ఆడించేందుకు బిసిసిఐ ప్లాన్ చేస్తోంది. అయితే, ఇప్పటికే వీరిద్దరూ టి20, టెస్టులకు గుడ్ బైచెప్పి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఇప్పుడు బిసిసిఐ పెట్టేషరతులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒప్పుకోకపోతే వన్డే ఫార్మాట్‌కూ వీడ్కోలు పలకాల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, ఈ ఏడాదిడి సెంబర్ నుంచి ప్రారంభమయ్యే.. విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దరూ పాల్గొంటేనే ప్రపంచ కప్ జట్టులో పరిగణనలోకి తీసుకొనే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నీలో ఆడకపోతే వీరికి అన్ని దారులు మూసుకుపోనట్టేనని త్వరలో జరిగే ఆస్ట్రేలియా సిరీసే చివరిది కావొచ్చని విశ్లేషకులు పేర్కోంటున్నారు.
ఆ సిరీసే.. కోహ్లీ, రోహిత్‌లకు చివరిది!
- Advertisement -
- Advertisement -
- Advertisement -