ముంబై: స్వల్ప వ్యవధిలో ముగ్గురు టీమిండియా సీనియర్ క్రికెటర్లు టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌గవాస్కర్ సిరీస్ మధ్యలోనే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సిరీస్ మధ్యలో అశ్విన్ అప్పట్లో తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయంపై పలు కథనాలు వినిపించాయి. టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ వైఖరీతో విసుగు చెందిన అశ్విన్ ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌కే వీడ్కోలు పలికేశాడు.
అశ్విన్ నిర్ణయం అప్పట్లో భారత క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. ఇక ఇటీవల కాలంలో మరో ఇద్దరు సీనియర్ క్రికెటర్లు కూడా సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. మరి కొంతకాలం పాటు అతను టెస్టుల్లో కొనసాగడం ఖాయమని అందరూ భావించారు. కానీ అందరిని విస్మయానికి గురి చేస్తూ రోహిత్ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా మరో స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ చెప్పేశాడు. కనీసం రెండు మూడేళ్ల పాటు టెస్టు క్రికెట్‌లో కొనసాగే ఫిట్‌నెస్ కోహ్లికి ఉంది. అయినా అతను అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం భారత క్రికెట్‌లో చర్చనీయాంశంంగా మారింది. ప్రధాన కోచ్ గంభీర్‌తో పడకనే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
ముందు నుంచే గంభీర్‌కు సీనియర్లపై మంచి అభిప్రాయం లేదు. ఐపిఎల్‌లో వివిధ జట్లకు కోచ్‌గా వ్యవహరించిన గంభీర్ సీనియర్లపై చిన్నచూపు చూశేవాడు. అతని వైఖరి నచ్చక భారత్‌తో పాటు విదేశాలకు చెందిన క్రికెటర్లు సయితం ఆయా ఫ్రాంచైజీలకు గుడ్‌బై చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అశ్విన్, రోహిత్, కోహ్లిలు తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయం వెనుక కూడా గంభీరే ప్రధాన కారణంగా ఉన్నాడని వార్తలు వినవస్తున్నాయి. సీనియర్ల కంటే యువ ఆటగాళ్లపైనే గంభీర్ ఎక్కువ నమ్మకాన్ని ఉంచుతాడు. కోల్‌కతాను మెరుగైన జట్టుగా తీర్చిదిద్దడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు.
సీనియర్లు జట్టులో ఉన్నా అతను మాత్రం యువకులపైనే ఎక్కువ నమ్మకం ఉంచేవాడు. తాజాగా టీమిండియాలో కూడా గంభీర్ వైఖరీనే అవలంభించాడు. ఇది సీనియర్లకు రుచించలేదు. అందుకే ఒకరి వెంట ఒకరు ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇలా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో దాని ప్రభావం టీమిండియాపై బాగానే చూపే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు గంభీర్‌తో సహా కోహ్లి, అశ్విన్, రోహిత్‌లు ఎలాంటి ప్రకటన చేయలేదు.