Friday, May 9, 2025

రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తీసుకున్న సంచలన నిర్ణయంపై భారత మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రోహిత్ ఉన్నట్టుండి ఇలాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తనకు ఇంత వరకు అర్థం కాలేదన్నాడు. భారత క్రికెట్‌పై రోహిత్ తనదైన ముద్ర వేశాడన్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ రోహిత్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచాడని కపిల్ ప్రశంసించాడు. రోహిత్ లాంటి క్రికెటర్లు చాలా అరుదుగా లభిస్తారన్నాడు. అతని రిటైర్మెంట్ టీమిండియాకు షాక్‌లాంటిదేనని పేర్కొన్నాడు.

కీలకమైన ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నాడు. మరి కొంత కాలం పాటు అతను టెస్టుల్లో కొనసాగి ఉండాల్సిందని సూచించాడు. ఇక రోహిత్ లోటును పూడ్చడం చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నాడు. అతనిలాగా వేగంగా బ్యాటింగ్ చేయడం అందరికి సాధ్యం కాదన్నాడు. రోహిత్ భారత్‌కు లభించిన ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకడన్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడన్నాడు. రోహిత్ వంటి క్రికెటర్లు చాలా అరుదుగా లభిస్తారని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News