Thursday, May 8, 2025

ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. టెస్ట్‌ల నుంచి రిటైరైన రోహిత్

- Advertisement -
- Advertisement -

ముంబై: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ అందించాడు. గత ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్ విజయం తర్వాత టి-20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన రోహిత్ తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా అతను అభిమానులతో పంచుకున్నాడు. ‘నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. వైట్ జెర్సీలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా గర్వకారణం. ఇన్ని సంవత్సరాలుగా నాకు మద్దతు ఇచ్చిన అందరికి నా కృతజ్ఞతలు. వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతాను’ అని రోహిత్ పేర్కొన్నాడు.

అయితే రోహిత్ ఈ సడెన్ నిర్ణయం తీసుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెలక్టర్లు ఇంగ్లండ్ సిరీస్ నుంచి అతని పేరును తొలగించారని.. అందుకే సెలక్టర్లు జట్టు ప్రకటించే ముందే రోహిత్ రిటైర్‌మెంట్ ప్రకటించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు.

తన కెరీర్‌లో రోహిత్ 67 టెస్టులు ఆడి.. 12 సెంచరీలు, 18 అర్థ శతకాలతో 4301 పరుగులు చేశాడు. భారత్‌కు 24 మ్యాచులు కెప్టెన్‌గా వ్యవహరించాడు రోహిత్. అందులో 12 మ్యాచుల్లో భారత్ విజయం సాధించగా.. 9 మ్యాచుల్లో ఓటమిపాలైంది. 3 మ్యాచులు డ్రా అయ్యాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రోహిత్ రిటైర్‌మెంట్‌తో త్వరలో ఆస్ట్రేలియా వెళ్లే టీం ఇండియాకు కొత్త టెస్ట్ కెప్టెన్ రానున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News