- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎయి ఇండిల్) చరిత్రలో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ కేవలం 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఐపిఎల్ లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ కే ఔటైన ప్లేయర్ గా చెత్త రికార్డును నెలకొల్పాడు. రోహిత్ మొత్తం 82 సార్లు రెండంకెల స్కోరు చేయకుండానే సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. తర్వాత దినేష్ కార్తిక్(72), విరాట్ కోహ్లీ(59), రాబిన్ ఊతప్ప(57), శిఖర్ ధవన్(56)లు ఉన్నారు.
కాగా, వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ తడబడి నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.
- Advertisement -