అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని వైసిపి నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. హోంమంత్రి అనిత, సవితపై ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత అనిత, సవితకు లేదని ధ్వజమెత్తారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు చంద్రబాబు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి, విజయ నగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీల పరిశీలించడానికి వస్తావా హోంమంత్రి అంటూ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో, విద్యార్థులు ఎలా ఉంటారో చూపిస్తానని రోజా సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
Also Read: గుంటూరు జిల్లాలో ఒకే గ్రామంలో 28 మంది మృతి.. ఎందుకు? ఏమిటి? ఎలా?
వైఎస్ఆర్ సిపి హయాంలో శరవేగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగాయని, మెడికల్ కాలేజీలలో మిగిలిన నిర్మాణ పనులు ప్రభుత్వమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు మెరగైన వైద్యం అందించాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పని చేశారని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీలపై వైఎస్ జగన్ అడిగన ప్రశ్నలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడంలేదని నిలదీశారు. చంద్రబాబు తయారు చేసిన ఫేక్ వీడియోలను హోంమంత్రి అనిత మీడియాకు చూపించారని దుయ్యబట్టారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అనంతపురంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్పత్రిని నిర్మించారన్నారు.