Tuesday, July 8, 2025

సత్యభామగా చేయడం లక్కీగా భావిస్తున్నా

- Advertisement -
- Advertisement -

కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ’ఓ భామ అయ్యో రామ’. (o bhama ayyo Rama) మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక మాళవిక మనోజ్ పాత్రికేయులతో మాట్లాడుతూ “దర్శకుడు రామ్ ‘ఓ భామ అయ్యో రామ’ కథ చెప్పగానే నాకు ఎంతో నచ్చింది. ఈ సినిమాలో నా నిజ జీవితానికి ఎలాంటి పోలికలు లేని సత్యభామ పాత్ర చేశాను. నాకు తెలుగు రాకపోయినా.. దాని భావం అర్థం చేసుకుని నటించాను. ఈ సినిమాలో కోసం నాకు స్విమింగ్ రాకపోయినా.. ఓ సన్నివేశంలో షూటింగ్ వాయిదా పడటం ఇష్టం లేక నేను భయపడుతూనే స్విమింగ్ చేశాను.

నాకు ఎంతో భయమేసిన సినిమా కోసం చేశాను. సుహాస్ ఎంతో హార్డ్‌వర్క్ చేస్తాడు. సినిమా సెట్‌లో సినిమా కోసం మాత్రమే మాట్లాడతాడు. ఈ సినిమాలోని లవ్ సన్నివేశాల్లో ఫీల్ కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎంటర్‌టైన్ అవుతారు. ఈ సినిమా చేయడం, ఇలాంటి పాత్ర లభించడం, సత్యభామ పాత్ర చేయడం నేను ఎంతో లక్కీగా భావిస్తున్నాను. నాకు ఎప్పుడూ, డిఫరెంట్‌గా చాలెంజింగ్ (Challenging different) పాత్రలు చేయాలని ఉంటుంది. ప్రతి సినిమాలో రొటీన్ పాత్రలు చేస్తే నాకే కాదు ఆడియన్స్‌కు కూడా బోర్ కొడుతుంది. నన్ను నేను ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రల్లో చూసుకోవడమే నాకు ఇష్టం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News