Thursday, July 10, 2025

విజయ్‌సేతుపతిలా సుహాస్ కూడా స్టారే

- Advertisement -
- Advertisement -

కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ’ఓ భామ అయ్యో రామ’. (Oh bhama ayyo Rama) మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్ బ్యానర్‌పై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో మంచు మనోజ్ బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ “యూట్యూబ్ నుంచి హీరోగా ఎదిగిన సుహాస్ జర్నీ ప్రేరణనిస్తుంది. తమిళంలో విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్ కూడా అలాంటి స్టారే.. అన్ని తరహా సినిమాలను చేస్తాడు. ఈ సినిమా విజయం సాధించి నిర్మాతలకు, దర్శకుడికి బ్రేక్ నివ్వాలి”అని అన్నారు.

హీరో సుహాస్ మాట్లాడుతూ “ప్రతి అబ్బాయి సక్సెస్‌ఫుల్ లైఫ్‌లో తల్లి, భార్యలు ఇద్దరూ ఎంతో కీలకంగా ఉంటారు. ఈ పాత్రలకు సంబంధించిన ఎమోషన్స్ (Emotions related characters) ఈ చిత్రంలో అందరి హృదయాలను హత్తుకుంటాయి”అని తెలిపారు. దర్శకుడు రామ్ గోధల మాట్లాడుతూ “ఈ సినిమా తరువాత మా హీరోయిన్ స్టార్ హీరోయిన్‌గా మారిపోతుంది. ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. స్వయం కృషితో ఎదిగిన హీరో సుహాస్‌కు తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ మంచి పేరుంది. ఈ సినిమాలో సుహాస్ ఆల్‌రౌండర్ ప్రతిభ చూపాడు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత హరీష్ నల్లా, అలీ, ప్రదీప్ తాళ్ళపు రెడ్డి, మాళవిక, శ్రీనాథ్, విజయ్ కనకమేడల, రామ్ జగదీష్, సంజనా రెడ్డి, రథన్, బీవీఎస్ రవి, డార్లింగ్ స్వామి, సాత్విక్, మణికందన్, రామ్ గోసాల, శ్రీ హర్ష తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News