Friday, August 15, 2025

ఢిల్లీలో కూలిన దర్గా ఫైకప్పు.. తప్పిన పెను ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఓ చారిత్రక కట్టడం సమీపంలో ఉన్న దర్గా కుప్పకూలిపోయింది. శుక్రవారం సాయంత్రం నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయున్ సమాధి (Humayun’s Tomb) సమీపంలో ఉన్న షెరీఫ్ పత్తే షా దర్గా పైకప్పు నేలమట్టమైంది. దీంతో ఆ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. పైకప్పు కూలిన సమయంలో అందులో ఇమామ్‌తో కలిపి 15 నుంచి 20 మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులు, పోలీసులు ఘటనస్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకూ 11 మందిని అధికారులు వెలికి తీశారు. మరో వ్యక్తిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News