Tuesday, May 20, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో ఈ రోజు నామమాత్రపు మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సీజన్‌ నుంచి ఎలిమినేట్ అయినా.. చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాజస్థాన్ రాయల్స్(RR) అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఎలిమినేట్ అయినా ఈ రెండు జట్లు, ఆడే చివరి మ్యాచుల్లో అయినా విజయం సాధించి తమ ఫ్రాంచైజీ పరువు నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌ కోసం రాజస్థాన్ తమ జట్టులో రెండు మార్పులు చేయగా.. చెన్నై(CSK) ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే సీజన్‌ కోసం ఎలా సన్నద్ధం కావాలో ఇరు జట్లకు తెలుసుకొనే అవకాశం ఉంది. ఏ విభాగంలో ఏ ఆటగాడు రాణిస్తున్నాడు.. లాంటి అంచనాలకు ఈ మ్యాచ్ బాగా ఉపయోగపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News