Saturday, August 2, 2025

గొర్రెల పంపిణీలో వెయ్యి కోట్లు బొక్కారు

- Advertisement -
- Advertisement -

బీఆర్‌ఎ స్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణి పథకంలో రూ.1000 కోట్ల కుంభకోణం జరిగిందని ఇడి సంచలనాత్మక ప్రకటన చేసింది. ఈ మేరకు ఇడి అధికారికంగా వెల్లడించింది. గత ప్రభుత్వంలో పశుసంవర్ధకశాఖ మంత్రిగా పని చేసిన తలసాని శ్రీనివాస యాదవ్‌కు ఓఎస్డీగా ఉన్న కల్యాణ్ కుమార్ నివాసంతో పాటు గతంలో ఇదే శాఖలో పని చేసిన అధికారుల నివాసాలలో నిర్వహించిన సోదాలలో లభించిన ఆధారాల మేరకు గొర్రెల పంపిణి కుంభకోణంలో రూ. 1000 కోట్ల వరకు చేతులు మారినట్టు గుర్తించినట్టు ఇడి పేర్కొంది. ఇలా ఉండగా ‘కాగ్’ ఆడిట్‌లో 7 జిల్లాల్లో గొర్రెల కొనుగోలు పథకంలో రూ. 253.93 కోట్ల నష్టం జరిగినట్లు పేర్కొంది. దీని ఆధారంగా 33 జిల్లాల్లో మొత్తంగా ఈ పథకంలో రూ.1000 కోట్లు గోల్‌మాల్ జరిగినట్లు ఇడి పేర్కొంది. ఈ నిధులను ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో ముడిపడిన 200కి పైగా అనుమానిత డమ్మీ, మ్యూల్ ఖాతాలకు మళ్లించినట్టు ఇడి గుర్తించింది. గొర్రెల పథకానికి లభ్ధిదారుల చేసిన చెల్లింపులు, అలాగే సంస్థలకు నిధులు బదిలీ సందర్భంగా కోట్లాది రూపాయల నిధులు చేతులు మారినట్టు ఇడి పేర్కొంది.

లబ్ధిదారుల ప్రమేయం లేకుండానే, గొర్రెల అమ్మకం, కొనుగోలు, సరఫరా అంతా బినామీల పేరుతోనే లావాదేవీలు జరిగినట్టు ఇడి దర్యాప్తులో తేలింది. లబ్దిదారులుగా పేర్కొన వారు గొర్రెలను అమ్మినవారు, కొనుగోలు చేసినవారంతా నకిలీలేనని చెల్లించిన డబ్బులు నకిలీ విక్రేతల బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్టు ఇడి దర్యాప్తులో తేలినట్టు పేర్కొన్నారు. చెక్క్ బుక్కులు పాస్‌బుక్కులు, డెబిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇడి పేర్కొంది. అలాగే ఈ లావాదేవీలకు ఉపయోగించిన 31 మొబైల్ ఫోన్‌లు, 20 సిమ్ కార్డులను ఇడి స్వాధీనం చేసుకుంది. ఇంత పెద్ద కుంభకోణాన్ని అధికారంలో ఉన్న రాజకీయ నేతల ప్రమేయం లేకుండా కేవలం అధికారులు మాత్రమే చేసి ఉండే అవకాశం లేదని ఇడి వర్గాలు అనుమానిస్తున్నాయి. తమ తదుపరి దర్యా ప్తులో ఈ అంశంపై దృష్టి సారించే అవకాశఉన్నట్టుఈ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News