- Advertisement -
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి కోట్ల విలువైన గంజాయిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితురాలిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువు దాదాపు రూ.రూ.13.3 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
- Advertisement -