Thursday, August 21, 2025

మేడారం జాతరకు రూ. 150 కోట్లు మంజూరు

- Advertisement -
- Advertisement -

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ప్రభుత్వం రూ. 150 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే మేడారం మహా జాతర నిర్వహణ, మేడారం లో శాశ్వత నిర్మాణాల పనుల కోసం రూ. 150 కోట్లు వెచ్చించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం మహా జాతర ను ఘనంగా నిర్వహించేందుకు రూ. 150 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌లకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News