- Advertisement -
తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వీటి వాడకం మాత్రం ఆగడంలేదు. తాభాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో బుధవారం జూలూరుపాడు మండలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి 8.30 క్వింటాళ్ల గంజాయి పట్టుకున్నారు. అనంతరం తొమ్మిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన గంజాయి ధర మార్కెట్ లో రూ.4 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి ముఠాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -