మన తెలంగా/గట్టు: మండల కేంద్రానికి చెందిన కత్రి లక్ష్మణ్ చరవాణిలో వచ్చి వాట్సాప్ లింక్ పిఎం కిసాన్ మెసేజ్ లింక్‌ను ఓపెన్ చేయ్యంగా బ్యాంకు ఖాతాకు మోబైల్ నెంబర్‌కు లింక్ అవ్వడంతో బాధితుని బ్యాంకు ఖాతాలో రూ.64వేలు బదిలీ అయినట్లు చరవాణికి మెసేజ్ రావడంతో బాధితుడు బ్యాంకుకు వెళ్లి అధికారులు విషయాన్ని వివరించాడు. బ్యాంకు అధికారులు బాధితుని ఖాతా నెంబర్ పరిశీలించి రూ.64వేలు సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి డబ్బులు బదిలీ అయినట్లు బాధితుడు తెలిపారు.బాధితుడు ఎస్‌ఎస్‌టి కౌన్సిలర్ అనూష, ప్రకాష్, వీరేష్ గౌడ్‌లతో కలసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుదవారం ఎస్‌ఐ కేటీ మల్లేష్‌కు ఫిర్యాధు పత్రాని సమర్పించాడు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతు పిఎం కిసాన్ పేరిట చరవాణికి వచ్చిన మెసేజ్‌ను జూన్ 25వ తేదిన బాధితుడు ఓపేన్ చేయ్యడంతో బ్యాంకు ఖాతా నుండి డబ్బులు సైబర్ నేరగళ్ళ బదిలీ అయ్యాయని అన్నారు.సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు అవగహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండలని చరనవాణిలో వాట్సాప్ ద్వారా వచ్చే లింక్‌ను ఓపెన్ చేయ్యవద్దని ప్రభుత్వ పథకాకు సంబందిచి ఆయా శాఖలకు మెసేజ్‌లకు సంబందిచిన వివరాల అడిగి తెలుసుకోవాలన్నారు.ప్రజలు వాట్సాప్ లింకులను ఓపేన్ చేసి డబ్బులు పోగోట్టుకోవద్దని తెలిపారు.