Thursday, September 18, 2025

అధిక వడ్డీ ఆశ చూపి రూ.7 కోట్లు టోకరా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు మోసం చేసిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా బయటికి వ చ్చింది. నలుగురు వ్యక్తులు సుమారు రూ.7 కోట్ల రూపాయలను బురిడీ కొట్టించారు. 202223 సంవత్సరంలో జరిగిన ఈ సంఘటనపై ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు డొంక బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ మండలం, గుడిపల్లి గ్రామానికి చెందిన కొండ్రాల మాసయ్య 2017లో సిఆర్‌పిఎఫ్‌లో రిటైర్మెంట్ అయ్యాడు.

అనంతరం హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో యూనియన్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరాడు. 2021లో మాదాపూర్‌లోని మేటలిటి కంపెనీలో పనిచేసే అండమాన్‌కు చెందిన రోహన్, ఆదిల్ అతనికి పరిచయం అయ్యారు. వారు పనిచేస్తున్న కంపెనీ దివాళా తీయడంతో గ్రోల్యాంగ్ కంపెనీ పేరుతో ఒక కంపెనీ వారు స్థాపించారు. వారిద్దరూ మాసయ్య దగ్గరికి వ చ్చి మంచి రిటర్న్ వస్తాయని ఆశ కల్పించారు. మరికొంతమందిని చేరిస్తే నెలకు రూ.30 వేల జీతంతో పాటు మంచి కమీషన్ ఇస్తామని, తమ భూ మినినీ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పడంతో యూనియన్ బ్యాంకులో మాసయ్య జాబ్ మానేసి తన వద్ద ఉన్న రూ.కోటి 68 లక్షలు వారి కంపెనీలో డిపాజిట్ చేశాడు.

నెల రోజుల్లో లక్షకు 25 శాతం వడ్డీ ఇస్తామని వారు చెప్పారు. దీంతో మాసయ్య అందులోనే ఏజెంట్‌గా చేరి నాగర్‌కర్నూల్ ప్రాంతానికి చెందిన 50 మందికిపైగా సుమారు 6 కోట్ల 78 లక్షల రూపాయలు 20223 వరకు కంపెనీలో డి పాజిట్ చేయించాడు. కంపెనీ నిర్వాహకులు కొన్ని రోజులు అందరికీ కమీషన్ ఇచ్చి రసీదు కూడా ఇచ్చారు. అనంతరం కంపెనీ మూసేయడంతో ఈ ఘరానా మోసం బయటపడింది. ఈ వ్యవహారంపై ఈ ఏడాది మే నెలలో మాసయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్‌పి గైక్వాడ్ వైభవ్ పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాసయ్య ఇచ్చిన ఆధారాలతో అం డమాన్ వెళ్లిన స్పెషల్ టీం రోహన్, ఆదిల్, రాము, అలీ అనే నలుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. పోలీస్ కస్టడీ అనంతరం దర్యాప్తు ప్రారంభించి పూర్తి వివరాలు తెలియజేస్తామని సిఐ అశోక్ రెడ్డి బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లో ఐటి దాడుల కలకలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News