Thursday, September 18, 2025

హిందువులకు ఒకే ఆలయం, ఒకే బావి ఉండాలి: మోహన్ భగవత్

- Advertisement -
- Advertisement -

అలీఘఢ్: దేశంలోని హిందువులకు ఒకే ఆలయం , ఒకే బావి ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్ ) అధినేత మోహన్ భగవత్ పిలుపు నిచ్చారు. హిందువులంతా కలిసికట్టుగా ఉండాలి. మతపరమైన సామరస్యాన్ని పెంపొందింపచేయాలని ఆయన కోరారు. అంతా కలిసి ఒకే గుడికి వెళ్లాలి. ఒకే జలాశయానికి వెళ్లి మంచినీరు తీసుకోవాలని, అప్పుడే వారి మధ్య ఉండాల్సిన సోదర బంధం ఇనుమడిస్తుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘఢ్‌లో ఆయన ఐదు రోజుల పర్యటనకు ఆదివారం వచ్చారు. ఐక్యతకు ప్రతీక దేవుడు, జలం, మరణానంతర అంత్యక్రియలు ఇవన్నీ కూడా సామూహికంగా జరగాల్సి ఉంది.

హిందూ సమాజానికి విలువలు, సంస్కారం కీలకం, సాంప్రదాయం, సాంస్కృతిక విలువుల , నైతిక సూత్రాల మూలాలు ఉన్న సామాజిక వ్యవస్థ నిర్మాణంలో అంతా పాలుపంచుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్వయం సేవకులను ఉద్ధేశించి ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. సమైక్యత , సామరస్య మూల సిద్ధాంతాలను ఇంటిలోనూ బయట ఎప్పటికప్పుడు తమ సందేశం వెలువరిస్తూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలని కోరారు. సమాజానికి నిర్మాణాత్మక శక్తిగా స్వయం సేవక్‌ల బృందం ఉంటుందని తెలిపారు. పండుగలు వస్తే సామూహికత ఉట్టిపడాల్సి ఉంటుంది. జాతీయవాదం, సామాజిక సహజీవన లక్షణాలు అణువణువునా ద్యోతకం కావల్సి ఉందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News