- Advertisement -
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన కొత్త చిత్రం ఆర్‌టి76తో మరోసారి తన సిగ్నేచర్ ఎనర్జీతో అలరించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూజా వేడుకతో ప్రారంభమైంది.ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఆర్‌టి76 హ్యుమర్, ఎమోషన్స్ తో కూడిన హోల్సమ్ ఎంటర్‌టైనర్‌గా వుండబోతోంది. ఈ చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్ (Hyderabad Monday) లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ప్రారంభమైంది. రవితేజ, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
- Advertisement -