- Advertisement -
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు శివారులో శ్రీశైల రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శ్రీశైలం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్రేన్ సహాయంతో వాహనాలను పోలీసులు పక్కకు తొలగిస్తున్నారు.
- Advertisement -