- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండిపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టిసి బస్సు, వ్యాన్ ను ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురుకి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -