- Advertisement -
చెన్నై: తమిళనాడులోని తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంగ్‌కిప్పటి బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై ఆర్‌టిసి బస్సు, టెంపో ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పోలీసులు పక్కకు తొలగించారు.
- Advertisement -