Saturday, September 13, 2025

రేవంత్ కోసం పాదయాత్ర చేపట్టిన ఆర్‌టిసి డ్రైవర్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాలినడకన శ్రీశైలం వస్తానని ఖమ్మం డిపో ఆర్‌టిసి డ్రైవర్ కాలసాని వీర లింగయ్య మొక్కుకున్నారు. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఖమ్మం డిపో నుంచి పాదయాత్ర చేపట్టారు. ఎగ్జిట్ పోల్స్ నమ్మడానికి వీలు లేదని ప్రచారం జరిగిన సమయంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పాటు రేవంత్ సిఎం కావాలని ఆయన మొక్కుకున్నారు. కోరిక నెరవేరడంతో ఆయన పాదయాత్ర రూపంలో మొక్కు చెల్లించుకుంటున్నారు. ఆర్‌టిసి కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో రేవంత్ వారికి మద్దతుగా నిలవడంతో ఆయనంటే ఆర్‌టిసి సిబ్బందికి ఎనలేని అభిమానం కలిగింది. శ్రీశైలం చేరుకునేందుకు 15 రోజుల సమయం పడుతుందని ఆర్‌టిసి డ్రైవర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News