Sunday, July 27, 2025

థియేటర్‌లో నిర్మాతను చెప్పుతో కొట్టిన నటి..(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోడల్, నటి రుచి గుజ్జర్.. ఓ సినీ నిర్మాతను చెప్పుతో కొట్టింది. ముంబైలోని సినీపోలిస్ థియేటర్‌లో శుక్రవారం రాత్రి ‘సో లాంగ్ వ్యాలీ’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ వేశారు. ఈ క్రమంలో రుచి గుజ్జర్ అక్కడికి వెళ్లి.. ఆ సినిమా నిర్మాతతో గొడవకు దిగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమంది మహిళలతో కలిసి థియేటర్ లోపలికి వెళ్లి రుచి.. నిర్మాతకు వ్యతిరేకంగా గాడిదపై ఊరేగిస్తున్నట్లు ఉన్న ప్లకార్డులను పట్టుకుని నిరసనకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో కోపంతో రెచ్చిపోయిన రుచి.. తన కాలి చెప్పు తీసి నిర్మాత పైకి విసిరి కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, రుచి గుజ్జర్‌ను రూ. 23 లక్షలకు మోసం చేశారనే ఆరోపణలతో ‘సో లాంగ్ వ్యాలీ‘ నిర్మాతపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. గురువారం గుజ్జర్ ఫిర్యాదు మేరకు ఆమెను మోసం చేసినందుకు సింగ్ పై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓషివారా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఓ టెలివిజన్ ఛానల్ కోసం సినిమా ప్రాజెక్ట్‌ను ప్రారంభించే నెపంతో సింగ్ తన నుండి డబ్బు తీసుకున్నాడని, లాభంలో వాటా, ఆన్ స్క్రీన్ క్రెడిట్‌ను తనకు ఇస్తానని హామీ ఇచ్చాడని రుచి గుజ్జర్ ఆరోపించినట్లు అధికారి తెలిపారు. అయితే, ఈ ప్రాజెక్టు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని.. నిర్మాత సింగ్ తన డబ్బును తిరిగి ఇవ్వలేదని రుచి ఫిర్యాదులో పేర్కొన్నారని అధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News