- Advertisement -
హైదరాబాద్: కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అసెంబ్లీ సాక్షిగా తానే చెప్పానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అవినీతి జరగలేదని తాను అన్నట్లు వక్రీకరిస్తున్నారని అన్నారు. నల్లొండలో తనపై వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పదవికి రాజీనామా, పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను నమ్మవద్దు అని రాజగోపాల్ రెడ్డి కోరారు.
Also Read :ఫేక్ అప్లికేషన్లు, ఫేక్ లాగిన్ ఐడిలతో ఓట్లను తొలగించారు: రాహుల్
- Advertisement -