Thursday, September 4, 2025

స్వల్పంగా లాభపడిన రూపాయి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రపంచ గందరగోళం, సుంకాల ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా భారత కరెన్సీ రూపాయి బలహీపడుతూ వస్తోంది. అయితే తాజాగా రూపాయి కొంత ఊరటనినిచ్చింది. బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ట స్థాయి నుండి 9 పైసలు పెరిగి 88.06 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సానుకూల ధోరణి, ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా డాలర్ బలహీనత వంటి అంశాలు ఈ బలానికి కారణమని విదేశీ మారక వ్యాపారులు అంటున్నారు. మంగళవారం రూపాయి డాలర్‌తో పోలిస్తే 88.15 వద్ద ముగిసింది, ఇది ఇప్పటివరకు అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. బుధవారం ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి 88.15 వద్ద ప్రారంభమై, ట్రేడింగ్‌లో కనిష్ట స్థాయి 88.19, గరిష్ట స్థాయి 87.98 మధ్య హెచ్చుతగ్గులకు గురైంది. రోజు చివరిలో డాలర్‌తో పోలిస్తే 88.06 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News