Tuesday, July 15, 2025

ఒక ఊరి కథ

- Advertisement -
- Advertisement -

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తున్న రూరల్ కామెడీ ‘కొత్తపల్లిలో (Kothapalli) ఒకప్పుడు’. కేరాఫ్ కంచరపా లెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్న నటి-, చిత్ర నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మనోజ్ చంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఇది ఒక ఊరి కథ.

నేను రామకృష్ణ అనే పాత్రలో కనిపిస్తా. అప్పన్న అనే ఒక వడ్డీ వ్యాపారి దగ్గర నేను పని చేస్తుంటాను. తను ఇచ్చిన అప్పులన్నీ నేను వసూలు చేస్తుంటాను. అప్పన్నకి జనాలకి మధ్య ఉన్న మీడియం నేను. రామకృష్ణ కి ఒక రికార్డింగ్ డాన్స్ స్టూడియో (Dance studio) ఉంటుంది. రామకృష్ణకి సావిత్రి అనే అమ్మాయి అంటే ఇష్టం. ఒకరోజు సావిత్రిని కలవడానికి ఒక గడ్డి వాము దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథ’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News