ప్రముఖ నటి మధు శాలిని సమర్పకురాలిగా (Kanya Kumari) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 27న వి నాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ “టీజర్ చాలా బాగుంది. శ్రీచరణ్, గీత్ చక్కగా నటించారు.
క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయారు. కచ్చితంగా ఇది చాలా మంచి సినిమా అవుతుందని నమ్మకం కలిగింది”అని అన్నారు. మూవీ సమర్పకురాలు మధు శాలిని మాట్లాడుతూ “సినిమా చాలా అద్భుతంగా (movie amazing) వచ్చింది. శ్రీ చరణ్, గీత్ వాళ్ళిద్దరు కూడా అక్కడే పుట్టి పెరిగినట్టు నటించారు. బన్నీ వాసు సపోర్ట్‌తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము. సృజన్ అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ సృజన్ మాట్లాడుతూ “సినిమాలో పాత్రలన్నీ కూడా రియల్ లైఫ్ నుంచి వచ్చినవే. ఈ సినిమాలో చాలా మంచి డ్రామా ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శశి కుమార్ తిక్క, హీరోయిన్ గీత్ సైని, శ్రీ చరణ్ పాల్గొన్నారు.