Wednesday, July 30, 2025

ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడులు.. 17 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కీవ్ : రష్యా-ఉక్రెయిన్ మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా సోమవారం అర్ధరాత్రి తమ దేశం లోని జైలుపై మాస్కో వైమానిక దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మంది గాయపడినట్టు తెలిపారు. ఉక్రెయిన్ లోని ఆగ్నేయ జపోర్జియా ప్రాంతం లోని జైలుపై ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. బిలెన్‌కివ్సా లోని మరో కాలనీపై కూడా ఈ దాడుల ప్రభావం కనిపించిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో 17 మంది చనిపోగా, 42 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.

సిబ్బందిలో ఒకరితో పాటు మరికొందరు గాయపడ్డారని తెలిపారు. జైలు డైనింగ్ హాలుతో సహా పరిపాలనా, క్వారంటైన్ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. మరో మూడంతస్తుల భవనం పాక్షికంగా దెబ్బతిందని , ప్రసూతి ఆస్పత్రితో సహా పలు ఆస్పత్రుల్లోని వైద్య సౌకర్యాలు నాశనమయ్యాయని వెల్లడించారు. ఈ దాడుల నేపథ్యంలో ఖైదీలు ఎవరూ జైలు నుంచి తప్పించుకోలేదని, స్పష్టం చేశారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు కీవ్ అధికారులు పేర్కొన్నారు. జైళ్ల వంటి పౌరుల మౌలిక సదుపాయాలను లక్షంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్నారు. ఇక రష్యా ప్రయోగించిన వాటిలో 32 డ్రోన్‌లను అడ్డుకున్నామని ఆ దేశ వైమానిక దళం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News