Sunday, September 7, 2025

ఉక్రెయిన్‌పై 800కు పైగా డ్రోన్లు, డెకోయ్‌లతో రష్యా ఎటాక్..

- Advertisement -
- Advertisement -

కీవ్: రష్యా ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై డోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. యుద్ధం మొదలయినప్పటి నుంచి ఇదే అతి పెద్ద వైమానిక దాడి అంటున్నారు. ఈ దాడిలో కనీసం ఇద్దరు చనిపోగా, కీలకమైన ప్రభుత్వ భవనాల కప్పు నుంచి పొంగలు లేస్తున్నాయి. రష్యా 805 డ్రోన్లు, డెకోయ్‌లతో ఈ దాడి చేసిందని అధికారులు తెలిపారు. అంతేకాక రష్యా 13 వివిధ రకాల క్షిపణులను కూడా ప్రయోగించింది. కాగా ఉక్రెయిన్ 747 డ్రోన్లు, నాలుగు క్షిపణులను కూల్చేసింది. కాగా దాడిలో ఇద్దరు చనిపోయారని, 15 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ ‘భరోసా దళం’గా దళాలను మోహరిస్తామని 26 ఉక్రెయిన మిత్ర దేశాలు ప్రతిజ్ఞ చేసిన తర్వాత, యుద్ధాన్ని ఆపమని యూరోపియన్ నాయకులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి పెంచిన తర్వాత ఈ దాడి జరిగిందన్నది గమనార్హం. ఇదిలావుండగా శాంతి ఒప్పందం కోసం పుతిన్‌తో చర్చలు జరుపుతానని, కలుస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ అన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా మీద ఆంక్షలు విధించాలని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News