Thursday, July 31, 2025

రష్యాలో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యాలో భారీ భూకంప సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.7గా నమోదైంది. రష్యా తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌కు వాతావరణ శాఖ సునామీ హెచ్చరిక జారీ చేసింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. భారీ భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హోకిడో నుంచి 250 కిలో మీటర్ల దూరంలో 19.3 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉందని అమెరికా, జపాన్ జియోలాజికల్ అధికారులు వెల్లడించారు. రష్యాలోని కుర్లి ద్వీపం, జపాన్ లోని హోకైడో సముద్ర తీర ప్రాంతాలలో సునామీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మూడు మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగిసి పడే అవకాశం ఉందని అమెరికా భూపరిశోధన విభాగం హెచ్చరించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News