ఉక్రెయిన్‌పై రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడడంతో కీవ్ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్ 100కు పైగా డ్రోన్లతో మాస్కో లోని డజనుకు పైగా ప్రాంతాలపై విరుచుకుపడింది. అయితే పలు డ్రోన్లను తాము సమర్ధంగా కూల్చేసినట్టు రష్యా పేర్కొంది. డ్రోన్ దాడుల కారణంగా మాస్కోకు సమీపం లోని 4 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. మాస్కో లోని ప్రధాన ప్రాంతాల్లో ఉక్రెయిన్ దాడుల వల్ల మరో తొమ్మిది ప్రాంతీయ విమానాశ్రయాలు కూడా స్పల్పంగా ధ్వంసమయ్యాయని ,
దీంతోవాటిని మూసేయాల్సి వచ్చిందని రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాట్సియా వెల్లడించింది. మరోవైపు రష్యా సరిహద్దు వద్ద ఉన్న ఉక్రెయిన్ లోని ఖార్కివ్ నగరంపై రష్యా దళాలు 20 కి పైగా డ్రోన్లను ప్రయోగించాయి. ఈ దాడిలో నలుగురు గాయపడగా, దాదాపు 100 మార్కెట్ స్టాళ్లు ధ్వంసమయ్యాయి. మరో ప్రాంతంలో మాస్కో బాంబులు ప్రయోగించిన ఘటనలో ఏడుగురు పౌరులు గాయపడినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు.