49 మంది ప్రయాణికులతో సోమవారం బయలుదేరిన రష్యన్ విమానం చైనా సరిహద్దుకు దగ్గరలో రష్యా తూర్పు ప్రాంతంలో కూలిపోయింది. ప్రయాణికులు అంతా మరణించారు. రష్యాలో సోమవారం అదృశ్యమైన అంగారా ఎయిర్ లైన్స్ ప్యాసింజర్ విమానం ప్రమాదానికి లోనయిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. విమానంలో ఐదుగురు చిన్నారులతో సహా 43 మంది ప్రయాణికులు, ఆరుగురు క్రూ మెంబర్స్ ఉన్నారు. రష్యా ఫార్ ఈస్టర్న్ అముర్ ప్రాంతంలోని టిండా సమీపంలో విమానం కూలిపోయింది.
సోమవారం అర్థరాత్రి నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమానంతో సంబంధాలు కోల్పోయారు. టిండా పట్టణంలో విమానం ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదం ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ప్రమాదం జరిగిన కొద్ది సమయంలోనే రిస్క్యూ టీమ్ మండిపోతున్న విమానం శకలాలను చూసింది.ఈ విమానం దాదాపు 50 ఏళ్లక్రితం సోవియెట్ యూనియన్ శకంలో 1976 లో నిర్మించినది. సైబీరియాకు చెందిన అంగారా ఎయిర్ లైన్స్ నడుపుతున్న ఆంటోనోవ్ ఏఎన్ -24 విమానం టిండా విమానాశ్రయంలో మొదట ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలమైంది. రెండో సారి ల్యాండింగ్ చేస్తుండగా రాడార్ నుంచి
కన్పించకుండా పోయింది. తర్వాత కుప్పకూలింది.