Sunday, May 11, 2025

పాకిస్తాన్ అసత్య ప్రచారం చేస్తోంది.. S-400 సేఫ్: సోఫియా ఖురేషి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగి పాక్ తీవ్రంగా నష్టపోయిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటన తర్వాత శనివారం విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. భారత్ S-400తోపాటు బ్రహ్మోస్ క్షిపణి స్థావరాలను పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన JF-17 నాశనం చేసిందంటూ పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. S-400 సేఫ్ అని.. భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.

భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని ప్రార్థనా స్థలాలను భారత్ టార్గెట్ చేయలేదని చెప్పారు. సిర్సా, జమ్మూ, పఠాన్‌కోట్, భటిండా, నలియా, భుజ్‌లోని మన వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయని పాకిస్తాన్ అసత్య ప్రచారం చేసిందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆర్మీ బేస్‌లను, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత సైన్యం ధ్వంసం చేసిందని చెప్పారు. ఇక పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా దీటుగా జవాబిస్తామని సోఫియా ఖురేషి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News