Friday, June 6, 2025

సెమీ ఫైనల్లో సబలెంక, స్వియాటెక్

- Advertisement -
- Advertisement -

పారిస్: ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అరిన సబలెంక (బెలారస్), ఐదో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) సె మీ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన సెమీ ఫైన ల్లో మాజీ నంబర్‌వన్ స్వియాటెక్ 61, 75 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన 13వ సీడ్ ఎలినా స్విటోలినాను ఓడించింది. తొలి సెట్‌లో స్వియాటెక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఏ దశలోనూ స్విటోలినాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ ఆటతో అలరించిన ఇగా ఎలాంటి ప్రతిఘటన లే కుండానే సెట్‌ను దక్కించుకుంది. కానీ రెండో సెట్‌లో స్విటోలినా పుంజుకుంది. అద్భుత ఆటతో ఇగాకు గట్టి పోటీ ఇ చ్చింది.

ఇద్దరు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో పోరు ఆసక్తికరంగా సాగింది. కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన ఇగా టైబ్రేకర్‌లో సెట్ ను గెలుచుకుని సెమీస్‌కు చేరుకుంది. టాప్ సీడ్ సబలెంక క్వార్టర్ ఫైనల్లో చెమటోడ్చి నెగ్గింది. చైనాకు చెందిన 8వ సీడ్ కిన్వెన్ జెంగ్‌తో జరిగిన పోరులో సబలెంక 76, 63తో వి జయం సాధించింది. ఆరంభం నుంచే పోరు హోరాహోరీగా సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీం తో సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో ఆఖరు వరకు ఆధిపత్యాన్ని చెలాయించిన సబలెంక సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో మాత్రం సబలెంకకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురు కాలేదు. తన మార్క్ షాట్లతో చెలరేగి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక సెమీస్‌లో స్వియాటెక్‌తో సబలెంక తలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News