మనతెలంగాణ/కందుకూరు: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 19 నెలలు గడుస్తున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలను అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యులు పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం కందుకూరు మండలంలోని కళ్యాణలక్ష్మి పథకం క్రింద మంజూరైన 31 చెక్కులను మండల సర్వసభ్య సమావేశ మందిరంలో అధికారులు, నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్‌ఎస్ హాయంలో ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేశామని నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రజలను అనేక ఇబ్బందులకు గూరిచేస్తున్నారన్నారు.
అధికారం చేపట్టడానికి అమలు సాధ్యం కానీ పథకాల హామిల ఆశచూపి పేద ప్రజలకు పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఇందిర్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాలలో అర్హత కల్గిన లబ్ధిదారులకు కాకుండా రాజకీయ పలుకుబడితో ఏంతో మందిని పథకాలకు దూరం చేస్తున్నారన్నారు. ప్రజలపై మీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పార్టీల పరంగా కాకుండా పార్టీలకతీతంగా పథకాలను అమలు చేయాలని సూచించారు. గత ప్రభుత్వ హాయంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ది కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కొనసాగించిన ఘనత కేసిఆర్‌కు దక్కుతుందన్నారు. అలాగే తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది రైతులకు రైతుభీమా, రైతు బంధు పథకాలతో ప్రతి ఒక్కరి మన్ననలు పొందారన్నారు.
గ్రామాల్లో సర్పంచుల గడువు తీరి అనేక నెలలు గడుస్తున్న రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో అనేక గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందని కనీస సౌకర్యాలు కల్పించడానికి పంచాయితీ కార్యదర్శులు నానా అవస్థులు ఎదుర్కుంటున్న పట్టించుకోకపోవడం సోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ కృష్ణానాయక్, పిఎసిఎస్ చైర్మన్ చంద్రశేఖర్ , ఎంఆర్‌ఎ గోపాల్, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, గంగాపురం లక్ష్మినర్సింహ్మరెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జయేందర్, ఎంపిటిసిల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు సురసాని రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎస్టీసెల్ అధ్యక్షులు లచ్చా నాయక్, మాజీ సర్పంచులు కాకి ఇందిర దశరథ, రామకృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, నరేందర్ గౌడ్, చంద్రశేఖర్ గుప్త, భూపాల్ రెడ్డి, మస్కు బాబు, నాయకులు, తాళ్లకార్తీక్, దీక్షిత్‌రెడ్డి, మహ్మద్ ఆలీ, తదితరులు పాల్గొన్నారు.