హైదరాబాద్: కూకట్పల్లిలో సహస్ర (Sahasra Kukatpally) అనే బాలికను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘాతుకానికి పాల్పడింది పదో తరగతి చదువుతున్న బాలుడు అని పోలీసులు విచారణలో తేలింది. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వచ్చి బాలికను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తమ కుమార్తె హత్య కేసును పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి హత్య చేశాడని చెప్పడం సరికాదని అన్నారు.
కూకట్పల్లి పోలీస్స్టేషన్ ఎదుట బంధువులతో కలిసి జాతీయ రహదారిపై బాలిక (Sahasra Kukatpally) తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. అతడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఆందోళనతో కూకట్పల్లి పోలీస్స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తల్లిదండ్రులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.
Also Read : కూకట్పల్లి బాలిక హత్యకేసు… నేను చంపితే… పిచ్చోడిలా ఎందుకు తిరుగుతాను