Friday, July 25, 2025

పంత్ గాయం తీవ్రంగానే ఉంది: సాయి సుదర్శన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయం నొప్పి తీవ్రంగానే ఉందని బ్యాటర్ సాయి సుదర్శన్ తెలిపారు. అతడి గాయం పరిస్థితిపై ఇవాళ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందన్నారు. పంత్ గాయంపై సాయి స్పందించారు. పంత్ బ్యాటింగ్‌కు రాకపోయినా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటామని వివరించారు. ఇంకా ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారని సాయి స్పష్టం చేశారు. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు 83 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(58), సాయి సుదర్శన్(61), కెఎల్ రాహుల్(46), శుబ్‌మన్ గిల్(12) పరుగులు చేసి ఔటయ్యాడు. రిషబ్ పంత్ 37 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(19), శార్థూల్ టాకూర్ (19) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా క్రిష్ వోక్స్, లయన్ డవ్సన్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News