బాలీవుడ్‌లో తాజాగా విడుదలైన చిత్రం ‘సయారా’ (Saiyaara). చిన్న సినిమా అయినప్పటికీ.. ప్రేక్షకులకు ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. జూలై 18న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.150 కోట్లు వసూళ్లు చేసింది. తన చిత్రం ఘన విజయం సాధించడంపై దర్శకుడు మోహిత్ సూరి హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆయన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా హిట్ అవుతుందని తొలుత నమ్మిన వ్యక్తి సందీప్ వంగానే అని అన్నారు.
‘‘సైయారాను (Saiyaara) ముందుగాన విజయం సాధిస్తుందని నమ్మిన వ్యక్తి సందీప్ వంగా, బహిరంగంగా మద్దతు ఇచ్చి పోస్ట్ కూడా పెట్టారు. ఆయన్ని ఎంతో ఆరాధిస్తాను. ఆయన కథలను తెరకెక్కించే తీరు అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నుంచి స్పూర్తిని పొందాను. ఏ విషయాన్నైనా నిర్భయంగా చెబుతారు. దాన్ని నేను గౌరవిస్తాను. ప్రజల హృదయాలను హత్తుకొనేలా సినిమాలు తీస్తారు. అందుకే ఆయన కథలకు అందరూ కనెక్ట్ అవుతారు. ఆయన లాంటి వారి అడుగుజాడల్లో నడవడం నాకెంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ మీ అభిమానికే’’ అంటూ మెహత్ సందీప్‌కి థ్యాంక్స్ చెప్పారు.