Sunday, July 20, 2025

కూటమి నేతలు పచ్చి అబద్దాలు చెప్తున్నారు: సజ్జల

- Advertisement -
- Advertisement -

అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. ప్రజల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డికి మద్దతుగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను కప్పిపుచ్చుందుకే అక్రమంగా అరెస్టులు (Illegal arrests) పెడుతున్నారని, పక్కా ఆధారాలతో గతంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారని అన్నారు. ఎంపి మిథున్ రెడ్డిది అక్రమ అరెస్టు అని మద్యం కేసు అంతా ఊహాజనితమే అని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మద్యం నియంత్రణ కోసం పని చేశామని తెలియజేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఏవిధంగా స్కాం జరుగుతుందో తెలియాలని అన్నారు. కూటమి నేతలు పచ్చి అబద్దాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తున్నాం అని లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికీ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారని సజ్జల పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News