పవన్‌కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). గురువారం(జూలై 24)వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించుకుంది. చాలాకాలం తర్వాత పవన్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గురువారం ఉదయం నుంచి థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు, కటౌట్లు కట్టి.. బాణాసంచా కాలుస్తూ హడావుడి చేశారు. అయితే సినిమా చూసి ఫుల్ ఖుషిలో ఉన్న పవన్ అభిమానులకు చిత్ర యూనిట్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది.
‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నుంచి ‘సల సల మరిగే’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. సాయిచరణ్ భాస్కరుని, లోకేశ్వర్, పివిఎన్ఎస్ రోహిత్ పాడారు. ఎం. ఎం. కీరవాణీ సంగీతం అందించారు. ఈ పాట వింటున్న వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటించగా.. బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఈ చిత్రం కొంత భాగం క్రిష్, మిగితా భాగం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.