Monday, June 23, 2025

ఆ కారణంతోనే హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోలేదంట

- Advertisement -
- Advertisement -

ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఈ హీరోనే స్వయంగా ఇప్పుడు దిగ్రేట్ ఇండియన్ కపిల్ టీవీ షోలో తెలిపారు. పలు బ్లాక్‌బస్టర్ సినిమాలు, విశేష ఫ్యాన్ బలం ఉన్న సల్మాన్ వయస్సు 59 సంవత్సరాలు. ఇప్పటికీ ఆయన పెళ్లి చేసుకోలేదు. ఎందుకు ఈ విధంగా ఒంటరి జీవితం గడుపుతున్నారనే ప్రశ్నకు సల్మాన్ స్పందించారు. తన బాధ తెలియచేసుకున్నారు. తాను మెదడుకు సంబంధించిన అత్యంత అరుదైన ఏవీ మాల్ఫోర్మేషన్ బ్రెయిన్ ఎన్యోరిజమ్‌తో బాధపడుతున్నానని తెలిపారు. ఇది ఎటు నుంచి ఎటు దారితీస్తుందో తెలియదన్నారు. నటుడిగా రాణించడం అంత తేలిక విషయం కాదు. తెరపై కన్పించే పలు యాక్షన్ సీన్‌ల వెనుక నటుడు ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు గాయాలు అవుతాయి. అయితే భావోద్వేగ దృశ్యాల దశలో తాము తెలియకుండానే మానసిక ఘర్షణకు గురి అవుతామని చెప్పారు.ముఖ భాగంలో నొప్పి, రక్తనాళాలలో అసాధారణ స్థితి, అన్నింటికి మించి మెదడులో తలెత్తే చిన్న పాటి సమస్యలు అనేకం తనకు ఉన్నాయని,

అయినప్పటికీ నటన సాగిస్తున్నానని చెప్పారు. ఈ వృత్తిలో కాసింత కూడా విరామం తనకు ఇష్టం లేదన్నారు. ఈ క్రమంలోనే తన జీవితం సాగుతోంది. ఇక ఈ దశలో పెళ్లి అనే అత్యంత కీలకమైన దశలోకి చేరడం తనకు ఇష్టం లేదని ఈ హీరో చెప్పారు. పెళ్లి చేసుకున్నామనుకోండి . ముందు బాగానే ఉంటుంది. క్రమేపీ జీవితానికి సంబంధించిన కుదింపులు ఉంటాయి. ఇక అనుకోకుండా విడాకులు సమస్య తలెత్తితే అది మరో సంక్లిష్టతకు దారితీస్తుంది. ఆనందం అయినా , ఆవేదన అయినా ఏదైనా అది మనిషి భావోద్వేగాలు, అంతకు మించి మన మెదడు రక్తనాళాలను ప్రభావితం చేసే అంశం అవుతుంది. ఇది దీర్ఘకాలంలో అయినా వెంటనే అయినా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే తాను ఎదుర్కొంటున్న సంక్లిష్ట ఆరోగ్య పరిస్థితి నడుమ , సరికొత్త జంజాటాలను దాంపత్య జీవితం ద్వారా కొని తెచ్చుకోవడం, వెంట వచ్చే వారికి కూడా సమస్యలు తెచ్చిపెట్టడం తనకు ఇష్టంగా ఉండదని, అందుకే పెళ్లికి దూరంగా ఉన్నానని ఈ అన్ని విధాలుగా అర్హుడైన బ్రహ్మచారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News