హీరోయిన్ సమంత-డైరెక్టర్ రాజ్ నిడిమోరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న సమంత.. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే, ఇందులో రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు.రాజ్, సామ్ భుజంపై చేయి వేసుకుని అమెరికా వీధుల్లో నడుస్తున్న ఫోటో.. ఇతర ఫ్రెండ్స్ తో కలిసి ఓ హోటల్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రాజ్ తో సామ్ ప్రేమాయణం నడుపుతున్నట్లు మళ్లీ రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రాజ్-సామ్ ఫొటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన భార్య శ్యామాలి చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే అర్థం వచ్చేలా శ్యామాలి పోస్ట్ పెట్టారు.
కాగా, డైరెక్టర్ రాజ్ నిడిమోరు రూపొందించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సరీస్ లో సమంత నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో రాజ్ తో దిగిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ గత కొంత కాలంగా నెట్టింట రచ్చ నడుస్తోంది. వీరిద్దరూ దిగిన ఫోటోలను పంచుకోవడంతో రూమర్స్ కు మరింత బలం చేకూరుస్తున్నాయి.