Friday, June 6, 2025

దుబాయ్‌లో విహారిస్తున్న సమంత.. ఫోటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

ఇటీవల తెలుగులో నిర్మాతగా మారి తీసిన తొలి చిత్రం ‘శుభం’తో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ సమంత. ప్రస్తుతం ఈ సక్సెస్ ను సామ్ ఎంజాయ్ చేస్తోంది. దుబాయ్ లో విహరిస్తూ అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సామ్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలావుంటే.. సామ్, డైరెక్టర్ రాజ్‌ నిడిమోరుతో డేటింగ్ చేస్తోందని రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. డైరెక్టర్ రాజ్‌ నిడిమోరు రూపొందించిన ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్ సరీస్ లో సమంత నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడిందని..ప్రస్తుతం వీరు డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో రాజ్ తో దిగిన ఫోటోలను సమంత పంచుకోవడంతో వీటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. అయితే, ఈ రూమర్స్ పై వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, ‘శుభం’ సినిమాకు రాజ్ క్రియేటీవ్ ప్రడ్యూసర్ గా వ్యవహరించారు. మరోవైపు, ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న సామ్ రెండో చిత్రాన్ని కూడా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News