Tuesday, September 16, 2025

యాక్షన్ డ్రామా ‘సామాన్యుడు’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

Samanyudu movie Trailer Released

యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘సామాన్యుడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ యాక్షన్ డ్రామాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన రావడంతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా మీద అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. టైటిల్‌కు తగ్గట్టు సినిమాలో విశాల్ కామన్ మ్యాన్‌గా కనిపించబోతున్నారు. ఒక క్రైమ్ కథను వివరిస్తూ విశాల్ పాత్ర పరిచయం అద్భుతంగా ఉంది. ‘ఒక ఇంట్లో రెండు శవాలున్నాయి. ఒకదానికి ప్రాణం ఉంది. ఇంకోదానికి ప్రాణం లేదు. ఆ ప్రాణమున్న శవం.. ప్రాణం లేని శవాన్ని చంపేసింది. తన ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే దారిలేక హత్య చేసేవాడికి, మిగతా వాళ్లను చంపి తను బతకాలని అనుకునేవాడికి చాలా తేడా ఉంది. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే దాన్ని ఏ యాంగిల్‌లో చూస్తున్నారన్నదే.. ఓ మంచి పోలీస్ ఆఫీసర్‌కు ఉండే ముఖ్యమైన అర్హత అని నేను అనుకుంటున్నాను’ అనే డైలాగ్ సినిమా నేపథ్యం ఏంటో చెబుతోంది. డింపుల్ హయతి, విశాల్ లవ్ స్టోరీ, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఉంది.

Samanyudu movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News