గురుగ్రామ్: శామ్‌సంగ్, భారతదేశంలో అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, ఈరోజు ‘శామ్‌సంగ్ కిడ్స్ డే @శామ్‌సంగ్ – 2025’ ను నిర్వహించింది. ఉద్యోగులు, వారి పిల్లలు, జీవిత భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన ఈ ప్రత్యేక వేడుక, శామ్‌సంగ్ కుటుంబంలో భాగమైనందుకు వారు గర్వంగా ఫీలయ్యేలా చేసింది. గురుగ్రామ్‌లోని శామ్‌సంగ్ కార్పొరేట్ కార్యాలయంలో ఈ రోజంతా నిర్వహించబడిన కార్యక్రమం, కుటుంబాలకు చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకాలను అందించడమే కాక, తదుపరి తరాన్ని కలలు కనడానికి, ఆవిష్కరించడానికి, సాంకేతికతను అన్వేషించడానికి స్ఫూర్తినిచ్చేలా రూపుదిద్దుకుంది.
శామ్‌సంగ్ కుటుంబాన్ని సెలబ్రేట్ చేసుకోవడం
ఈ చొరవ ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి శామ్‌సంగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, వారు పనిచేస్తున్న వాతావరణాన్ని దగ్గరగా చూశారు. కంపెనీ ఆవిష్కరణ మరియు సంరక్షణ సంస్కృతిని అనుభవించే ఈ అవకాశంలో జీవిత భాగస్వాములు కూడా పాల్గొనడం వల్ల, ఈ వేడుక విస్తృత కుటుంబాలు కలిసి ఉండటానికి ప్రతీకగా నిలిచింది.
“‘కిడ్స్ డే@శామ్‌సంగ్’ అనేది కుటుంబాలకు మన కంపెనీ ద్వారాలు మాత్రమే కాదు, మన హృదయాలు కూడా తెరవడమే. అదే సమయంలో, పిల్లల మనస్సులను ఆవిష్కరణల ప్రపంచానికి పరిచయం చేయడం గురించి కూడా. కుటుంబ సభ్యులను కార్యాలయంలోకి ఆహ్వానించడం ద్వారా, వారు శామ్‌సంగ్‌లో భాగమైనందుకు గర్వపడాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఏడాది వేడుక మా సన్నిహిత శామ్‌సంగ్ కుటుంబ బంధాలను బలోపేతం చేయడమే కాక, తదుపరి తరాన్ని సృష్టికర్తలు, ఆలోచనాపరులు, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడానికి మేము చేస్తున్న నిరంతర కృషికి ప్రతిబింబంగా నిలిచింది,” అని మిస్టర్. రిషబ్ నాగ్‌పాల్, పీపుల్ టీమ్ హెడ్, శామ్‌సంగ్ ఇండియా అన్నారు.
యువ మనస్సులకు స్ఫూర్తి
‘నో శామ్‌సంగ్ (శామ్‌సంగ్ గురించి తెలుసుకోండి)’ అనుభవంలో భాగంగా, పిల్లలు బిజినెస్ ఎక్స్పీరియన్స్ స్టూడియోను సందర్శించారు. అక్కడ వారు శామ్‌సంగ్ యొక్క అత్యాధునిక ఉత్పత్తులను అనుభవించి, స్మార్ట్ థింగ్స్ ఎకోసిస్టమ్ అందించే అనుసంధానిత ప్రపంచాన్ని ప్రత్యక్షంగా చూశారు.
పిల్లలు మినీ CEO ఛాలెంజ్‌లో కూడా పాల్గొని, ‘నేను శామ్‌సంగ్ CEO అయితే, ఏ ఉత్పత్తిని ప్రారంభిస్తాను?’ అనే అంశంపై సృజనాత్మక ఆలోచన చేశారు. ఈ కార్యక్రమం వారికి సృజనాత్మకంగా ఆలోచించమని, సాంకేతికత యొక్క భవిష్యత్తును ఊహించమని ప్రోత్సహించింది.
కుటుంబాలు సృజనాత్మక అన్వేషణకు దిగిన క్షణాలు:
● శామ్‌సంగ్ స్టూడియో- ఉత్పత్తి వాణిజ్య ప్రకటనలను శామ్‌సంగ్ ఎలా సృష్టిస్తుందో తెరవెనుక నుండి చూడండి.
● జిమ్ & యోగా రూమ్-ఉద్యోగుల శ్రేయస్సుపై సంస్థ యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది.
● తల్లిదండ్రుల పని ప్రదేశం-పిల్లలు తమ తల్లిదండ్రుల పని ప్రదేశాలను గర్వంగా చూసి, సహోద్యోగుల కుటుంబాలను కలుసుకుని, బంధాలు మరియు స్నేహాన్ని బలోపేతం చేస్తారు.
వినోదం, ఆట మరియు సమైక్యత
పండుగ ఉత్సాహాన్ని పెంచడానికి, సరదా స్టాల్ గేమ్స్, టాటూ ఆర్ట్, వ్యంగ్య చిత్రాలు, హెయిర్-బ్రెయిడింగ్ మరియు నెయిల్ పెయింటింగ్‌తో కిడ్స్ ప్లే జోన్ ఏర్పాటు చేయబడింది. పిల్లలు బహుమతులు గెలుచుకుని, తేలికపాటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండటంతో ఆ రోజు వినోదం, ఆట, ఉత్సాహంతో నిండిపోయింది.
వేడుక ప్రత్యేకంగా పిల్లల కోసం తయారుచేసిన స్నాక్ బాక్సులు మరియు క్యూరేటెడ్ గిఫ్ట్ హ్యాంపర్లతో ముగిసింది. ఇది శామ్‌సంగ్ యొక్క కృతజ్ఞతను మరియు విస్తరించిన కుటుంబం పట్ల ప్రేమను ప్రతిబింబించే ఒక చిన్న సంకేతం.