మేషం – సంతానం పురోగతి గర్వించే విధంగా ఉండాలని మీరు భావిస్తారు, కానీ వాస్తవ జీవితంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన.
వృషభం – చాలామంది జీవితాలు మీ ఆలోచన విధానాల మీద మీ ఇష్టయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. కనుక ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అన్ని విషయాలలోనూ లౌక్యం ప్రదర్శించడం మంచిది.
మిథునం – బంధువులతో ఉన్న విభేదాలను పరిష్కరించి ఒక శుభకార్యం జరగడానికి మీరు కారుకులు అవుతారు. దైనందిన జీవితంలో మార్పులు తెస్తారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది.
కర్కాటకం – కొంతమంది వ్యక్తులకు మీ పరిధి,శక్తి ఏమిటో తెలిసే విధంగా ప్రవర్తిస్తారు. కుటుంబ విషయాలలో బయటి వారి అతి జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. వారి పరిధిలో వారిని ఉంచి మీ పరిధి ఏమిటో తెలుసుకొని ప్రవర్తిస్తారు.
సింహం – మీ శక్తి కొలది ఇతరులకు సహాయపడతారు. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలలో పోటీ పరీక్షల విషయంలో ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు.
కన్య – ముఖ్యమైన విషయాలు విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల అభివృద్ధికి మీ వ్యూహరచన ఫలిస్తుంది. దివారాత్రులు కష్టపడి పని చేస్తారు. సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు.
తుల – వృత్తి ఉద్యోగాల పరంగా పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. సాంకేతిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి.పాల ఉత్పత్తులకు సంబంధించి లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి.
వృశ్చికం – కుటుంబం పట్ల మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అగ్రిమెంట్లు పూర్తవుతాయి. నిర్మాణ సంబంధమైన పనులు అనుకూలిస్తాయి.
ధనుస్సు – నలుగురికి సహాయపడాలనుకునే మీ మనస్తత్వానికి భగవంతుడు తగిన విధంగా మంచి అవకాశాలను అందిస్తాడు. ఫైనాన్షియల్ స్కీములు, లక్కీ డ్రాలకు దూరంగా ఉండండి.
మకరం – స్త్రీలతో విరోధం, స్త్రీల సహాయ నిరాకరణ, వాళ్లతో అభిప్రాయ భేదాలు ఏర్పడి కొన్ని మంచి కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. మానసిక సంఘర్షణకు లోనవుతారు.
కుంభం – పురోగతి బాగుంటుంది. మీకు ఇబ్బంది కలిగించే ఉత్తర్వులు మీ ప్రమేయం లేకుండానే రద్దవుతాయి. దైవానుగ్రహం ఉంది అని నిరూపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి.
మీనం – రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. సాంప్రదాయ వంటకాల వైపు మొగ్గు చూపుతారు.