Saturday, September 13, 2025

అతడిని త్వరగా ఔట్ చేస్తే చాలు గెలిచినట్టే: మంజ్రేకర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాలో భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఓ సలహా ఇచ్చాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్‌ను త్వరగా ఔట్ చేసి డ్రెస్సింగ్ రూమ్‌కు పంపించాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు. ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేస్తే మ్యాచ్ గెలిచనట్టేనని పేర్కొన్నాడు. ట్రావిస్ హెడ్ ఔటైన క్షణం ఎంతో అద్భుతంగా ఉంటుందని వివరణ ఇచ్చాడు. టీమిండియా పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవదని సూచించాడు. భారత్ జట్టు ప్రత్యర్థి ఉంటే చాలు ట్రావిస్ హెడ్ విజృంభిస్తాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేయడంతో టీమిండియా వరల్డ్ కప్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో కూడా భారత బౌలర్లకు హెడ్ తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News