Wednesday, September 3, 2025

సంజూ శాంసన్‌ను టాప్ ఆర్డర్‌లో ఆడించాలి: ఆకాశ్ చోప్రా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న ఆసియా కప్ టి20 టోర్నమెంట్‌లో స్టార్ ఆటగాడు సంజు శాంసన్‌ను టాప్ ఆర్డర్‌లో ఆడించాలని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా సూచించాడు. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌లో కాకుం డా టాప్‌లోనే సంజును దించితే జట్టుకు ప్రయోజనంగా ఉంటుందన్నాడు. ఆసియా కప్‌లో సంజు సేవ లు టీమిండియాకు చాలా కీలకమన్నాడు. అతన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే టోర్నీలో ట్రోఫీని సాధించడం భారత్‌కు మరింతి తేలికవుతుందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా సంజు కు ఉందన్నాడు. సంజును ఓపెనర్‌గా లేకుంటే వన్‌డౌన్‌లో ఆడిస్తే ప్రయోజనంగా ఉంటుందన్నాడు. అతన్ని నాలుగు నుంచి ఏడు స్థానాల్లో దించితే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News