Monday, August 4, 2025

ఘనంగా సంతోషం అవార్డ్స్ కర్టెన్ రైజర్ వేడుక

- Advertisement -
- Advertisement -

సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్,(Film Awards) సంతోషం ఒటిటి అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. సీనియర్ నటులు మురళీ మోహన్, నిర్మాత కెఎస్ రామారావు, ఫిల్మ్ నగర్ హోసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, నిర్మాత ఏడిద రాజా, రామసత్యనారాయణ, అనిల్, డా. సురేష్ బాబు, వళ్లూరు విజయకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఒటిటి అవార్డ్స్ 2025 ఫంక్షన్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు మురళీ మోహన్ మాట్లాడుతూ – 24 ఏళ్లుగా అవార్డ్స్ ఈవెంట్ చేస్తున్న ఏకైక మేగజైన్ సంతోషం. సౌత్ ఇండియాలో ఫిలింఫేర్ (Filmfare South India) తప్ప మరో మేగజైన్ ఏదీ కూడా ఇంత సుదీర్ఘ కాలం అవార్డ్స్ ఫంక్షన్స్ చేయలేదు. కానీ సురేష్ ఒక్కడు ఎంతో కష్టపడి 24వ సారి ఈవెంట్ చేస్తున్నాడు’ అని అన్నారు. సంతోషం మేగజైన్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘2002లో ఫస్ట్ సంతోషం ఈవెంట్‌లో నాగార్జున ఫిలింఫేర్ అవార్డ్స్ లా సంతోషం అవార్డ్స్ పేరు తెచ్చుకోవాలి అన్నారు. ఆయన మాట మీద నేను కనీసం 25 ఏళ్లు ఫిలిం అవార్డ్స్ ఈవెంట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇది 24వ సంవత్సరం. అందరి సహకారం వల్లే నేను ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయగలుగుతున్నా’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News