Wednesday, September 17, 2025

సర్ఫరాజ్‌కు మెట్రో బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులతో పాటు నాన్ కేడర్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. చాలా  ఏళ్లుగా మెట్రోరైల్ ఎండిగా పనిచేస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా (పట్టణ, రవాణా) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్ మెట్రోరైల్ ఎండిగా సర్ఫరాజ్ అహ్మద్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇక, హెచ్‌ఎండిఏ సెక్రటరీగా కోటం శ్రీవాత్సకు అదనపు బాధ్యతలను కట్టబెట్టింది.

ఇక, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా శృతి ఓజాను తిరిగి నియమించగా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, కో ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న రాజిరెడ్డిని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా, ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా రాజేశ్వర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సిఈఓగా ఉన్న జితేందర్‌రెడ్డిని టిడి ఆయిల్‌ఫెడ్ ఎండిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం హెచ్‌ఎండిఏ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఉపేందర్ రెడ్డిని హెచ్‌ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా (సబ్ అర్భన్ రీజియన్)గా ప్రభుత్వం బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎస్‌జిఎంసి అధికారి టి.వెంకన్నను హెచ్‌ఎండిఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్భన్ రీజియన్ అండ్ మెట్రోరైల్)గా నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: గుట్టలుగా నోట్ల కట్టలు.. ఎసిబికి చిక్కిన మరో అవినీతి తిమింగలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News